Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియా ఖాన్ అలియాస్ నఫిసా ఖాన్... ట్విట్టర్‌లో ఇంకా ఫాలోయింగ్... అతడు ఎందుకేడ్చాడు...?

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2015 (17:43 IST)
జియా ఖాన్ అలియాస్ నఫీసా ఖాన్ ట్విట్టర్‌ను ఇంకా ఆమె అభిమానులు ఫాలో అవుతూనే ఉన్నారు. ఆమె 23-05-2013 నాడు తన చివరి ట్వీట్ చేసి ఆపేసింది. ఆత్మహత్యకు ముందు... ఆమె చివరి ట్వీట్... సో... సారీ, ట్విట్టర్ నుంచి నేను నిష్క్రమిస్తున్నా అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆ తర్వాత జూన్ నెల 3న ఆత్మహత్యకు పాల్పడింది. ఐనప్పటికీ ఆమె ట్విట్టర్‌ను ఆమె అభిమానులు ఫాలో అవుతూనే ఉన్నారు. ఆమె గురించిన పాత విషయాలను సెర్చ్ చేస్తూ ఆమె తన గురించి చెప్పిన విషయాలను చూసి తెలుసుకుంటున్నారు.
 
కాగా జియా ఖాన్ ఆత్మహత్య కేసుపై సీబీఐ చార్జిషీటు నేపధ్యంలో మీడియాలో రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఓ రోజు రాత్రి జియా ప్రియుడు సూరజ్ పంచోలి తండ్రి ఆదిత్య పంచోలి స్వయంగా జియా ఖాన్ ఇంటికి వచ్చారట. నేరుగా వచ్చి జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ కాళ్ల వద్ద కూర్చుని బోరుమంటూ విలపించారట.
 
ఇకపోతే జియా ఖాన్ మానసికంగా ఒత్తిడిలో ఉన్నదనీ, ఆమెను వంటరిగా వదిలేస్తే ఏమైనా చేసుకుంటుందన్న అనుమానం సూరజ్ పంచోలికి ముందే కలిగిందని చార్జిషీటులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఆమెను ఓ కంట కనిపెట్టి ఉండాలని సూరజ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొంతకాలం ఆమెను తన ఇంట్లోనే పెట్టాడనీ, ఐతే ఇద్దరి మధ్యా తరచూ గొడవలు వస్తుండటంతో ఆమెను తన ఇంటికే పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ ఇంటికి పంపినప్పటికీ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే అతడు హెచ్చరించిన నెల తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

Show comments