Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై కన్నేసిన బావ.. స్నాక్స్‌లో డ్రగ్స్ ఇచ్చి.. అత్యాచారం

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:20 IST)
మరదలిపై కన్నేసిన ఓ బావ ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఓ చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఒక కామపిశాచి మరదలికి డ్రగ్స్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈవిషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని, హజారీ ఘర్ జిల్లా, విష్ణు ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్జామ్ గ్రామంలో కొల్లేశ్వర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.
 
అదే గ్రామంలో తల్లితండ్రులతో కలిసి నివసించే మరదలిపై మోజు పడ్డాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఇటీవల ఆ యువతి కొల్లేశ్వర్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఆమెను అనుభవించటానికి అదే సమయం అనుకున్నాడు. ఆమెను లోపలికి పిలిచి.. తినటానికి స్నాక్స్ ఇచ్చాడు. అవి తిన్న యువతి మత్తులోకి జారుకుంది. వెంటనే ఆమెను బెడ్ రూంలోకి తీసుకు వెళ్లిన కొల్లేశ్వర్ మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన యువతి జరిగిన ఘోరం గుర్తించి కన్నీటి పర్యంతమయ్యింది. 
 
ఈ విషయం గురించి ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లితండ్రులు కంగారు పడ్డారు. విషయం తెలుసుకుని స్ధానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కొల్లేశ్వర్ తన మరదలికి ఇచ్చిన స్నాక్స్‌లో డ్రగ్స్ కలిపినట్లు పోలీసులు కనుగొన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments