ప్రేమించలేని నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతక ప్రేమికుడు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (09:24 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. యువతి నిద్రపోతున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్కండ్ రాష్ట్రంలోని దుమ్కాలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న అంకిత(19)ను షారుక్‌ హుస్సేన్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తూ వచ్చాడు. అందుకు అంకిత అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న హుస్సేన్ ఈ నెల 25వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 
 
ఫలితంగా ఆమె శరీరం 90 శాతం మేరకు కాలిపోయింది. రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి దాటాక (ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు) అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న హుస్సేన్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments