Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో అమ్మ.. పన్నీర్ సెల్వంకు శాఖల బదలాయింపు.. జయమ్మ పనులు ఓపీ చేస్తారు..

తమిళనాడు సీఎం జయలలితను బుధవారం బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరామర్శించనున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని ప్ర

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (10:11 IST)
తమిళనాడు సీఎం జయలలితను బుధవారం బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరామర్శించనున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు జయలలితను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని హోమాలు, పూజలు చేస్తున్నారు. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురికావడంతో ఆమె వద్ద వున్న శాఖలను తాత్కాలికంగా పన్నీర్ సెల్వంకు బదలాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమెకు లండన్, ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది. మరికొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఉండాల్సి వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 ప్రకారం కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్ సెల్వంకు అధికారాలు అప్పగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి తిరిగి విధులలో చేర వరకు ఆమె శాఖలను పన్నీర్ సెల్వం నిర్వహిస్తారని, ముఖ్యమంత్రి సలహాపైనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ముఖ్యమంత్రిగా జయలలిత కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments