Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మను మించిన దైవం ఉన్నదా?'.. జయలలిత పేరుతో రూ.1.6 కోట్లు సమర్పించారు

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలు, అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఆమె మాటే వేదం.. శాసనంగా భావిస్తుంటారు. అలాంటి అమ్మ కోసం అజ్ఞాత భక్తులు ఏకంగా రూ.1.6 కోట్

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (13:51 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలు, అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఆమె మాటే వేదం.. శాసనంగా భావిస్తుంటారు. అలాంటి అమ్మ కోసం అజ్ఞాత భక్తులు ఏకంగా రూ.1.6 కోట్ల విలువ చేసే ఆభరణాలను సమర్పించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అనారోగ్యానికి గురైన జయలలిత గత నెల 22వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, ఏడీఎంకే శ్రేణులు ముక్కోటి దేవతలను వేడుకుంటున్నారు. ఆ క్రమంలోనే కర్ణాటకలోని మైసూర్‌ ఆలయంలో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది.
 
'కోదండ ఎస్టేట్' అని మాత్రమే చెప్పి తమ పేర్లను వెల్లడించని తమిళ భక్త బృందం.. అమ్మపేరు మీద రూ.1.6 కోట్ల విలువైన ఆభరణాలకు మైసూర్‌లోని ఆలయానికి సమర్పించుకున్నారు. మైసూర్ శివారులోని చాముండీ హిల్స్‌పైగల గణపతి, ఆంజనేయస్వామి ఆలయాలకు వచ్చిన జయలలిత అభిమానులు.. స్వామివార్ల విగ్రహాలకు భారీ స్థాయిలో ఆభరణాలను ఇచ్చి వెళ్లారు. 
 
ఇంత భారీ మొత్తంలో ఆభరణాలు ఇచ్చిన వారు కనీసం పేరైనా చెప్పలేదని, తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని తామీ పని చేస్తున్నామని అన్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. 
 
అందుకే అంటారు.. 'అమ్మను మించి దైవం ఉన్నదా?' అని. ఈ సామెత తమిళుల కోసమే రాశారేమో అనిపించక మానదు. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితను అక్కడ చాలామంది దైవం కంటే మిన్నగా భావిస్తారు. ఆమె పాలన వర్ధిల్లాలని ప్రార్థనలు చేస్తారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments