Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఫోటోతో పన్నీర్ సెల్వం కేబినెట్ భేటీ.. కావేరి సమస్యపై చర్చ 32 మంది మంత్రులు హాజరు..

తమిళనాడు సీఎం జయలలితకు నమ్మినబంటు ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమ్మ లేకపోయినా తాను కూర్చున్న చైర్‌కు ముందు ఓ పెద్ద ఛైర్ వేసి అందులో జయమ్మ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (16:37 IST)
తమిళనాడు సీఎం జయలలితకు నమ్మినబంటు ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమ్మ లేకపోయినా తాను కూర్చున్న చైర్‌కు ముందు జయమ్మ పెద్ద ఫోటోను ఉంచి మంత్రి వర్గ సమావేశాన్ని కొనసాగించారు. ఆ విధంగా జయలలిత పట్ల తనకున్న ఆరాధనను చాటుకున్నారు. 32 మంది మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 
గత నెల 22 నుంచి అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమెకున్న పోర్ట్‌పోలియోలన్నీ పన్నీర్‌సెల్వంకు కేటాయించడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ లేకుండా పన్నీర్ సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా కావేరీ సమస్యను ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈనెల 24తో కౌన్సిలర్లు, మేయర్ల పదవీ కాలం ముగుస్తున్నందున స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా జయలలిత క్రమంగా కోలుకుంటున్నారన.. ఆమె మంచినీరు, ఉడకబెట్టిన యాపిల్‌ పండ్లను తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఆది నుంచి ఆమెకు అపోలో వైద్యులతో పాటు లండన్‌కు చెందిన వైద్యులు రిచర్డ్‌ బీలే, ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా సింగపూర్‌కు చెందిన మరో ఇద్దరు వైద్యనిపుణులు కూడా ఫిజియోథెరపీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments