Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మరణంపై అనుమానాలున్నాయ్.. సీబీఐ విచారణకు డిమాండ్.. సుప్రీంలో పిల్

అనుకున్నదే జరిగింది. 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి అమ్మ జయలలిత మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణంపై చెన్నైకు చెందిన ఓ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (11:56 IST)
అనుకున్నదే జరిగింది. 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి అమ్మ జయలలిత మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణంపై చెన్నైకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో అకస్మాత్తుగా ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించడానికి బంధువులు సహా ఎవరినీ అనుమతించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ ఎన్ జీవో సుప్రీంకోర్టులో పిల్ వేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంను కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులను (మెడికల్ డాక్యుమెంట్స్) స్వాధీనం చేసుకోవాలని కోరింది. జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెను ఆమె బంధువులు కూడా కలవనివ్వకుండా చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్‌ను కూడా ఆమెను చూడనివ్వలేదు. 
 
అంతేగాకుండా అపోలో యంత్రాంగం.. ఆస్పత్రిలో జయ ఫోటోలను విడుదల చేయకపోవడంపై అనుమానాలున్నాయి. తీవ్ర జ్వరంతో అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ కోలుకుంటున్నారన్న ఆనందం ఎంతో సేపు నిలవకుండానే కార్డియాక్ అరెస్ట్‌తో ఈ లోకాన్ని వీడడం విషాదాన్ని నింపింది. రేపో మాపో డిశ్చార్చ్ కానున్న అమ్మ ఆకస్మిక మృతితో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు షాక్ తిన్నారు. 
 
దీంతో అమ్మ డెత్ మిస్టరీ వీడాలని జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ విచారణ, వైద్య నివేదికలు స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments