Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' శవపేటిక నమూనాతో ఆర్కే నగర్‌లో పన్నీర్ వర్గం... ఛీ ఛీ...

ఇంకా నయం... జయలలిత మమ్మీ(సమాధిలోని శవం)ని తీసుకొచ్చి ప్రచారం చేయలేదు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం మరింత దరిద్రంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన నాయకులు ఇళ్లల్లో ఎక్కడ సోదా చేస్తే అక్కడ రూ. 20

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:37 IST)
ఇంకా నయం... జయలలిత మమ్మీ(సమాధిలోని శవం)ని తీసుకొచ్చి ప్రచారం చేయలేదు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం మరింత దరిద్రంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన నాయకులు ఇళ్లల్లో ఎక్కడ సోదా చేస్తే అక్కడ రూ. 2000 నోట్ల కట్టలు కట్లపాముల్లా దర్శనమిస్తున్నాయి. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఇంట్లో లెక్క చెప్పుకోలేనంత డబ్బు ఐటీ దాడుల్లో వెలుగుచూశాయంటున్నారు.
 
అన్నాడీఎంకే చీలిక వర్గానికి సారధ్యం వహిస్తూ ఎన్నికల బరిలో నిలిచిన పన్నీర్ సెల్వం వర్గం విచిత్రమైన ఎన్నికల ప్రచారానికి తెరతీసింది. ఏకంగా జయలలిత శవపేటిక నమూనాను ఆర్కే నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా తిప్పుతూ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. దీనిపై జనం.. ఛీ... థూ... ఓట్ల కోసం మరీ ఇంత దారుణమా... అని మండిపడుతున్నారు. దీనితో ఆ శవపేటికను ప్రస్తుతానికి పక్కన పెట్టారు. 
 
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన పరిస్థితి అటు పన్నీర్, ఇటు శశికళ వర్గాలది. దీనితో ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో కోట్లలో డబ్బు, కోట్ల లీటర్ల మద్యం ఏరులై పారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలు జరగాల్సిన తేదీ ఏప్రిల్ 12ను వాయిదా వేసే అవకాశం వుందని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments