Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత 16 ఏళ్ల క్రితమే వీలునామా రాసేశారట.. రక్తసంబంధీకురాలిపైనే అంతా రాశారట..?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో ఆమె ఆస్తులకు ఏమౌతాయనే అనుమానాలు వెల్లువెత్తాయి. జయలలిత వందలాది కోట్ల ఆస్తులకు వారసురాలు ఎవరు? అనేదానిపై చర్చ సాగింది. ఆమె ఎవరి పేరిటైనా ఇప్పటికే

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (09:36 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో ఆమె ఆస్తులకు ఏమౌతాయనే అనుమానాలు వెల్లువెత్తాయి. జయలలిత వందలాది కోట్ల ఆస్తులకు వారసురాలు ఎవరు? అనేదానిపై చర్చ సాగింది. ఆమె ఎవరి పేరిటైనా ఇప్పటికే వీలునామా రాశారా? అని జయలలిత మరణం తర్వాత పలు అనుమానాలు తలెత్తాయి. వీటిన్నింటికి సమాధానం దొరికింది.

16 ఏళ్ల కిందటే జయ తన రక్తసంబంధీకురాలిపై వీలునామా రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్‌ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్టర్‌ చేశారు.
 
వీలునామా ఎవరి పేరిట రాశారన్న సంగతి మాత్రం తెలియజేసే వీలులేదని సమాచారం. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం 'బుక్‌ 3'లో నమోదైన వీలునామా సమాచారాన్ని రాసిన వారసురాలు (లీగల్‌ హెయిర్‌)కు మినహా ఇతరులకు వెల్లడించేందుకు వీలు కాదని పేర్కొంటున్నారు. వీలునామాతోపాటు రెండు ట్రస్ట్‌లను కూడా జయలలిత 2000 జూలై 14న రిజిస్ట్రేషన్‌ చేశారని తెలుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా హైదరాబాద్‌ నగర శివారులోని జేజే గార్డెన్స్‌లో జరిగింది.
 
నాడు జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు. వీలునామా, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్‌(పేట్‌ బషీరాబాద్‌)లోని తన గార్డెన్స్‌ చిరునామాతో చేయించారు. 'పురట్చి తలైవి బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్, నమద్‌ ఎంజీఆర్‌ బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌'లను (డాక్యుమెంట్‌ నంబర్లు బుక్‌ 4లో 31, 32) రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ ట్రస్టుల నిర్వాహకులుగా జయలలిత తన పేరుతోపాటు తన నెచ్చెలి శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను చేర్చారు. ఆపై 2001లో ట్రస్ట్‌ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేశారు.
 
నాడు మేడ్చల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ స్వయంగా జేజే గార్డెన్స్‌కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకొని రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ పదవీ విరమణ చేసినప్పటికీ జయలలిత ఆస్తుల కేసు విచారణ సమయంలో పలుమార్లు సీబీఐ, న్యాయస్థానాల ఎదుట హాజరైనట్లు తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments