Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కోలుకుంటున్నారు... తమిళనాడు రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అంతకంతకూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ సి.హెచ్ విద్యాసాగార రావు ఆమె ఆరోగ్యం గురించి ఓ ప్రకటన వెలువరించారు. ఆమె కోలుకుంటున్నారనీ, ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులను ప్రశంసిస్తున్నట్ల

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (20:50 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అంతకంతకూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ సి.హెచ్ విద్యాసాగార రావు ఆమె ఆరోగ్యం గురించి ఓ ప్రకటన వెలువరించారు. ఆమె కోలుకుంటున్నారనీ, ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులను ప్రశంసిస్తున్నట్లు చెప్పారు. దీనితో 40 గంటలుగా సాగుతున్న ఉత్కంఠకు తెర పడింది.
 
కాగా సెప్టెంబరు 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అన్నాడీఎంకె కార్యకర్తలు అమ్మ కులాసాగా ఉన్నారంటూ ఆసుపత్రి గేట్లు వద్దకు వచ్చి మరీ చెప్తున్నారు.
 
ఇదిలావుంటే జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుపుతూ ఫోటోలు విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అన్నాడీఎంకె పార్టీ స్పందిస్తూ... అమ్మ ఫోటోలు విడుదల చేయాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. మరైతే భారీగా పోలీసుల పహారా అపోలో ఆసుపత్రి వద్ద ఎందుకు అనే ప్రశ్నలు కూడా కొందరు వేస్తున్నారు. మొత్తమ్మీద అమ్మ ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్తున్నప్పటికీ ఆసుపత్రిలో ఆమె ఎలా ఉన్నారో ఫోటోలు విడుదల చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments