Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది.. అమ్మ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చు: ప్రతాప్ రెడ్డి

తమిళనాడు సీఎం జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిందని.

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (14:11 IST)
తమిళనాడు సీఎం జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిందని.. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు.
 
అపోలో వైద్యులతో పాటు లండన్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సింగపూర్‌కు చెందిన ఫిజియోథెరపిస్టులు జయలలితకు చికిత్స అందిస్తున్నారని.. దీంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేగాకుండా జయలలిత వెంటిలేటర్‌తో కాకుండా సహజసిద్ధంగా శ్వాస తీసుకోగలుగుతున్నారని..  అందుకే ఆమెను సీసీయూ నుంచి చెన్నై అపోలోలోని నాలుగో అంతస్థులో ప్రత్యేక వసతులతో కూడిన ఎల్.. అనే వీఐపీ వార్డుకి మూడు రోజుల క్రితం మార్చారు.
 
కాగా సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర అస్వస్థతతో జయలలిత ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కానీ అమ్మ శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారని.. ఆమెను ప్రైవేట్ రూమ్‌కు మార్చినా ఆమెకు అప్పుడప్పుడు కృత్రిమ శ్వాస అవసరం కావడంతో.. తిరిగి ఆమెను సీసీయూకి మార్చే దిశగా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని కొన్ని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  
 
సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. పలువురు వీఐపీలు ఆపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments