Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్ట్ అసిస్టెడ్ డివైజ్ అమ్మకు ఎలా అమర్చారు..? అమ్మకు గుండె కొద్దిసేపు ఆగిందా?

తమిళనాడు సీఎం జయలలితను అపోలో వైద్యులు 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. జయలలితకు 'ఎక్స్ ట్రాకార్పోరియల్ ముంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్' అమర్చారని, ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షణలో చికిత్స చేస

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (13:02 IST)
తమిళనాడు సీఎం జయలలితను అపోలో వైద్యులు 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. జయలలితకు 'ఎక్స్ ట్రాకార్పోరియల్ ముంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్' అమర్చారని, ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నారని సమాచారం. జయలలితకు ఎలాంటి చికిత్స అందించాలన్న విషయంపై లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలేని ఎప్పటికప్పుడు అపోలో వైద్యులు సంప్రదిస్తున్నారని సమాచారం.
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంపై సోమవారం మద్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్పారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వచ్చినది గుండెపోటు కాదని.. ఆమె గుండె కొద్దిసేపు ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) అపోలో ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నాయి. ఈ కారణంగానే ఆమెకు సోమవారం ఉదయం ఒక ఆపరేషన్ కూడా జరిగినట్లు పార్టీ ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు నిజానికి చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
 
శరీరంలోని వివిధ భాగాలకు రక్తసరఫరాను గుండె ఆపేసినప్పుడు కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది. పేషెంటు ఉన్నట్టుండి కుప్పకూలి, సాధారణంగా ఊపిరి తీసుకోకపోవడం, స్పందనలు లేకపోవడం లాంటి లక్షణాలు ఇందులో సంభవిస్తాయని వైద్యులు చెప్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments