Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఐస్‌క్రీమ్ తిన్నారు.. షుగర్ లెవల్స్ పెరిగిపోయాయ్: అపోలో రిపోర్ట్

అపోలో ఆస్పత్రి బృందం విడుదల చేసిన జయలలిత మెడికల్ రిపోర్టులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. జయలలిత న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరారని అపోలో స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్స్‌ తినడం ద్వారా షుగర్‌ లెవల్స్‌ పెరిగా

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (17:52 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి 9నెలలు దాటిపోతున్నా ఆమె మృతి పట్ల ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. జయ మృతిపై వందల ప్రశ్నలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. జయ మృతి వెనుక ఏదో కుట్ర ఉందని నమ్మేవాళ్లే ఎక్కువ. జయ మరణం తర్వాత శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌ సైతం అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తంచేశారు. జయ మృతి వెనుక శశికళ కుట్ర ఉందని ఆరోపిస్తూ వచ్చిన పన్నీర్‌ సెల్వం సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. 
 
పన్నీర్‌ తరహాలోనే మంత్రి శ్రీనివాసన్‌ కూడా జయలలిత మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 22న తీవ్ర అస్వస్థతతో... అపోలో ఆస్పత్రిలో చేరిన జయ ఆరోగ్యంపై తామంతా అబద్దాలు చెప్పామని అన్నారు. అపోలో ఆస్పత్రిలో చేరినప్పట్నుంచి చనిపోయేవరకూ అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదన్నారు. అయితే అపోలోలో చికిత్స పొందిన జయలలితకు సంబంధించిన వీడియోలు తమ వద్ద వున్నాయని శశికళ మేనల్లుడు దినకరన్ వెల్లడించారు. ఆ వీడియోలో అమ్మ నైటీలో వుండటం వల్లే విడుదల చేయలేదన్నారు. 
 
తాజాగా, అపోలో ఆస్పత్రి బృందం విడుదల చేసిన జయలలిత మెడికల్ రిపోర్టులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. జయలలిత న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరారని అపోలో స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్స్‌ తినడం ద్వారా షుగర్‌ లెవల్స్‌ పెరిగాయని అపోలో సిబ్బంది తెలిపారు. 
 
ఆస్పత్రిలో చేరినప్పుడు జయ ఒంటిపై ఎక్కడా గాయాలు లేవని రిపోర్టులో పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే స్పృహలోకి వచ్చిన జయలలిత, రెండు వారాల పాటు స్పృహలోనే ఉన్నారని అపోలో తెలిపింది. ఆ తర్వాతే ఆమె ఆరోగ్యం విషమించిందని రిపోర్టులో అపోలో వైద్యులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments