Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు ఆగిన గుండె.. ఈసీఎంవో ద్వారా ఆక్సిజన్ సరఫరా? ఇక దైవాదీనమేనంటున్న వైద్యులు!!

ముఖ్యమంత్రి జయలలిత గుండె పని చేయడం ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా ఈసీఎంవో (ఎక్మో) ద్వారా అమ్మ గుండెకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఈ చికిత్సా విధానమంతా క్రిటికల్ కేర్ వైద్యుల ప

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (12:05 IST)
ముఖ్యమంత్రి జయలలిత గుండె పని చేయడం ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా ఈసీఎంవో (ఎక్మో) ద్వారా అమ్మ గుండెకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఈ చికిత్సా విధానమంతా క్రిటికల్ కేర్ వైద్యుల పర్యవేక్షణలో సాగుతోంది. అసలు ఎక్మో అంటే ఏంటో తెలుసుకుందాం. 
 
జయలలితకు ఎక్మో విధానంతో చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎక్మో అంటే ఏమిటి? దానిపై ఉంచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? అనే ప్రశ్నలు ప్రజలందరిలో కలగడం సహజం. ఎక్మో అనేది ప్రాథమికంగా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గకుండా చూసే యంత్రం. ‘ఎక్స్‌ట్రా కార్పోరల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌’గా దీన్ని పిలుస్తారు. గుండె, ఊపిరితిత్తుల్లో సంక్షోభం ఏర్పడినపుడు ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది గుండె, ఊపిరితిత్తుల బాధ్యతలను స్వీకరిస్తుంది. 
 
ఇది రెండు రకాలు... 1) గుండె, ఊపిరితిత్తులు పని చేస్తూనే వాటికి ఎక్మో సహాయకారిగా ఉండటం. 2) పూర్తిగా గుండె, ఊపిరితిత్తులకు విశ్రాంతినిచ్చి ఆ బాధ్యతను ఎక్మో స్వీకరించడం. 
 
మొదటి విధానంలో.. సాధారణంగా జీవక్రియల్లో రక్తంలోని ఆక్సిజన్‌ దహించుకుపోతుంది. తిరిగి రక్తంలో ఆక్సిజన్‌ నింపే బాధ్యత ఊపిరితిత్తులది. అవి విఫలమైనపుడు గుండెకు ఎక్మో యంత్రాన్ని తగిలిస్తారు. అది నేరుగా గుండెకు వచ్చిన చెడు రక్తాన్ని తీసుకొని దానిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తొలగించి, ప్రాణవాయువును నింపి, ఆ రక్తాన్ని తిరిగి గుండె నుంచి ప్రజర్‌ ద్వారా దేహంలోని వివిధ భాగాలకు పంపిస్తుంది. 
 
రెండో విధానంలో... ఇక్కడ గుండె, ఊపిరితిత్తులను పూర్తిగా నిలిపేస్తారు. యంత్రమే ఆక్సిజన్‌ హరించుకుపోయిన చెడు రక్తాన్ని స్వీకరించి, తిరిగి అదే మంచి రక్తాన్ని దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తుంది. ఇందులో రక్తాన్ని వెచ్చబరిచే బాధ్యత యంత్రానిదే. ఇందులో గుండె ఊపిరితిత్తుల పాత్ర ఉండదు. అవి విశ్రాంతి తీసుకొంటాయి. అవి మెరుగుపడ్డాక ఎక్మోకు సమాంతరంగా పని చేస్తాయి. చివరకు ఎక్మోను తొలగిస్తారు.
 
రెండో పద్ధతిలో ఎక్మో ఎనిమిది గంటల పాటు పని చేస్తుంది. అది విజయవంతమై గుండె, ఊపిరితిత్తులు మెరుగు పడితే ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులు, ఎక్మో సమాంతరంగా పని చేయిస్తారు. ఈ పద్ధతిలో యంత్రాన్ని 1-2 వారాలు పనిచేయించవచ్చు.
 
సాధారణంగా ఎక్మోను చివరి అస్త్రంగా భావిస్తారు. ఎక్మో యంత్రం ఉపయోగించడం వల్ల వచ్చే ప్రధాన సమస్య సైడ్‌ ఎఫెక్ట్‌లు. ఇటీవలి కాలంలో వాటిని బాగా తగ్గించగలగడం వల్ల యంత్రం మీదకు వెళ్లిన వాళ్లు బతికి బయటపడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. 
 
అందువల్లే ఎయిమ్స్ వంట అత్యున్నత వైద్యశాలకు చెందిన నలుగురు వైద్యుల బృందంతో పాటు.... అపోలో ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందుస్తున్నారు. అలాగే, లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ బీలేను కూడా చెన్నైకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments