Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో పత్రికలు తిరగేస్తున్న జయలలిత... కోలుకున్నట్టేనా?

తీవ్ర అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మెల్లగా కోలుకుంటున్నారు. వైద్య నిపుణులు ఇస్తున్న యాంటీబయాటిక్స్, మెడిసిన్లకు అమ్మ స్పందిస్తున్నారు. ఈ మేరకు ఆమె చికిత్స ప

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (11:02 IST)
తీవ్ర అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మెల్లగా కోలుకుంటున్నారు. వైద్య నిపుణులు ఇస్తున్న యాంటీబయాటిక్స్, మెడిసిన్లకు అమ్మ స్పందిస్తున్నారు. ఈ మేరకు ఆమె చికిత్స పొందుతున్న చెన్నై అపోలో హాస్పిటల్ హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్టు వైద్యులు వెల్లడించారు. అందువల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేందుకు మాత్రం మరింత సమయం పడుతుందని చెపుతున్నారు. 
 
మరోవైపు... జయలలిత త్వరగా కోలుకోవాలంటూ తమిళనాట పూజలు ఊపందుకున్నాయి. ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలతో ఆలయాలన్ని కిక్కిరిసిపోయాయి. చెన్నైకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌‌తో బాధపడుతూ గత నెల 22న జయలలిత ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అయితే మూడు, నాలుగు రోజుల నుంచి ఆమె ఆరోగ్యంపై పెద్ద ఎత్తున వదంతులు రావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. 
 
ఇంకోవైపు... ఆమె ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. జయలలిత చాలా త్వరగా కోలుకుంటున్నారని... ప్రస్తుతం ఆమె పేపర్లు కూడా చదువుతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని తమకు వైద్యులు వెల్లడించారని చెప్పారు. మీరు నిర్వహిస్తున్న శాఖల బాధ్యతలను ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించాలని నోట్ పంపగానే... ఆమె 'సరే' అని అన్నారని పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పూర్తి స్పృహలోనే ఉన్నారని... కాకపోతే, ఇన్ఫెక్షన్ల కారణంగా ఇతరులెవరినీ వైద్యులు లోపలకు అనుమతించడం లేదని చెప్పారు. కేవలం వైద్యులు మాత్రమే లోనికి వెళ్లి ఆమెకు సందేశాలు వినిపిస్తున్నారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రికి తెలియకుండా అన్నాడీఎంకేలో ఏమీ జరగదని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments