Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీజియన్ గుప్పెట్లో జయలలిత మరణ రహస్యం.. బయటకు పొక్కితే ప్రకంపనలే...

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణ రహస్యం ప్రముఖ హ్యాకర్ సంస్థ లీజియన్ గుప్పెట్లో ఉన్నాయి. ఈ సంస్థ వీటిని బహిరంగపరిస్తే మాత్రం ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకం

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (15:54 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణ రహస్యం ప్రముఖ హ్యాకర్ సంస్థ లీజియన్ గుప్పెట్లో ఉన్నాయి. ఈ సంస్థ వీటిని బహిరంగపరిస్తే మాత్రం ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని ఆ సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
సెప్టెంబరు 22వ తేదీ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 5న తేదీ అర్థరాత్రి కన్నుమూసిన విషయంతెల్సిందే. ఆ తర్వాత అపోలో ఆస్పత్రి కేంద్రంగానే తమిళనాడు రాజకీయాలు సాగాయి. ముఖ్యంగా జయలలిత రాజకీయ వారసుడు, తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కూడా జయలలిత భౌతికకాయం గదికి సమీపంలోనే  జరిగినట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని రాజకీయ, జర్నలిజంతోపాటు పలురంగాల ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలను లీజియన్ సంస్థ హ్యాక్‌ చేసింది. అలాగే, అపోలో ఆస్పత్రికి చెందిన కంప్యూటర్ సర్వర్లను కూడా హ్యాక్ చేసి, మొత్తం సమాచారాన్ని సేకరించింది. ఇందులో జయలలిత చికిత్సకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నట్టు ప్రకటించింది. అయితే, వీటిలో ఏ ఒక్క విషయాన్ని కూడా బహిర్గతం చేయలేదు. 
 
"కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నంతో భారత్‌లోని 40 వేలకు పైగా సర్వర్ల సమాచారంపై పట్టుచిక్కింది. బర్ఖాదత్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యక్‌ ద్వారా ఆమె మెయిల్స్‌కు సంబంధించి 1.2 జీబీ డేటాను డంప్‌ చేశాం" అని లీజియన్‌ ప్రతినిధి వెల్లడించినట్లు వాషింగ్టన్‌ పోస్టు ప్రతినిధి తెలిపారు. తమ తదుపరి లక్ష్యం ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీయేనని చెప్పారన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments