జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో విద్యార్థులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు చట్టబద్ధత తేవడంతో ఆందోళనలు ముగిశాయి. కానీ మెరీనా
జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో విద్యార్థులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు చట్టబద్ధత తేవడంతో ఆందోళనలు ముగిశాయి. కానీ మెరీనా బీచ్‌లోని ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిపై పోలీసుల అరాచకాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి.
మెరీనా బీచ్ సమీపంలోని మెరీనా అడ్జర్న్ ఏరియాలో అనేక మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కనిపించిన వారిని కసీతీరాకొట్టారు. అయితే పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించిన యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు ఆపరిసర ప్రాంతాల్లోని చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిని మీద విరుచుకుపడి దురుసుగా ప్రవర్తించారు.
మెరీనా ఎడ్జర్న్ ఏరియాలో నివాసం ఉంటున్న మహిళలు వారి ఇంటి ముందు నిలబడి ఉంటే పోలీసులు అతి దారుణంగా లాఠీలతో కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా చితకబాదేశారు. జల్లికట్టు ఆందోళనలతో మాకు ఎలాంటి సంబంధం లేదని మహిళలు మొరపెట్టుకుంటున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఆడ, మగ అనే తేడా లేకుండా చిక్కినవారిని చిక్కినట్లు పోలీసులు చితకబాదేశారు. ఇంట్లో ఉన్న మగాళ్లను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వారిపై లాఠీ ఛార్జీ ప్రయోగించారు.
ఇకపోతే.. జల్లికట్టు ఆందోళనతో చెన్నై నగరంలో పలు వాహనాలు దగ్దం అయ్యాయని పోలీసులు అంటున్నారు. మెరీనా బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ మీద ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. పోలీస్ స్టేషన్‌తో పాటు ఆ ప్రాంగణంలో నిలిపి ఉన్న 50 ద్విచక్రవాహనాలు, జీపులకు నిప్పంటించారు.
పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళా పోలీసులతో సహ 16 మంది పోలీసులను లోపలపెట్టి బయట తాళం వేసి నిప్పంటించి సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించారని.
అదే సమయంలో తాము అటు వైపు వెళ్లిన విషయం గుర్తించిన ఆందోళనకారులు అక్కడి నుంచి పారిపోయారని సాటి పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీసులు కిటికీలు పలగొట్టుకుని, వెనుక తలుపుల నుంచి బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారని అధికారులు అంటున్నారు. చెన్నైలోని కొన్ని చోట్ల 10 కార్లకు నిప్పంటించారని పోలీసు అధికారులు తెలిపారు.