Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం.. పోటీలను ప్రారంభించనున్న సీఎం పన్నీర్ సెల్వం

జల్లికట్టు క్రీడ కోసం తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆమోదం తెలిపారు. దీంతో ఆదివారం మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలను ఆ

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (17:16 IST)
జల్లికట్టు క్రీడ కోసం తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆమోదం తెలిపారు. దీంతో ఆదివారం మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం పచ్చజెండా ఊపి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి మదురైకు బయలుదేరినట్టు సమాచారం.
 
మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరుపై అన్నాడీఎంకే ఎంపీలు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. జల్లికట్టుకు సంబంధించి తమ ఎంపీలు యేడాది కాలంగా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారని... కానీ, మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నాడీఎంకే నేత తంబిదురై ఆరోపించారు. మోడీ తీరు తమకు తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పారు. 
 
జల్లికట్టు కోసం త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. జల్లికట్టు అంశాన్ని పరిష్కరించాలని అమ్మ జయలలిత గతంలోనే కేంద్రాన్ని కోరారని... కానీ, కేంద్ర ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తంబిదురై విమర్శించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments