Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంజీఆర్ వుండి వుంటే తాట తీసేవారు.. రజనీతో కలిసి నటిస్తా.. పోలీసులా నటులా?: కమల్ హాసన్

దివంగత తమిళనాడు సీఎం ఎంజీఆర్ వుండి వుంటే ఆందోళనకారులతో కలిసి పోరాడి వుంటారని సినీ లెజెండ్ కమల్ హాసన్ వెల్లడించారు. శాంతియుతంగా జరిగిన జల్లికట్టు ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టింది పోలీసులేనని మంగళవ

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (15:17 IST)
దివంగత తమిళనాడు సీఎం ఎంజీఆర్ వుండి వుంటే ఆందోళనకారులతో కలిసి పోరాడి వుంటారని సినీ లెజెండ్ కమల్ హాసన్ వెల్లడించారు. శాంతియుతంగా జరిగిన జల్లికట్టు ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టింది పోలీసులేనని మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కమల్ హాసన్ దుయ్యబట్టారు. ఎంజీఆర్ వుండి వుంటే.. ఆందోళనకారుల వద్దకు అనుమతించకపోయినా.. లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడే వారని కమల్ ఈ సందర్భంగా వెల్లడించారు. 
 
ఇంకా కమల్ హాసన్ మాట్లాడుతూ.. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడం.. విద్యార్థులపై రాజకీయ రంగు పులమడం మంచిది కాదని... ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అనుమతించే ప్రసక్తే లేదన్నారు. విద్యార్థులే హింసకు పాల్పడ్డారని చెపుతున్న పోలీసులు.. ఆటోలకు ఎందుకు నిప్పంటించారని కమల్ హాసన్ ప్రశ్నించారు. పోలీసులే విధ్వంసానికి కారణమవడమే కాకుండా.. విద్రోహ శక్తులని కుంటిసాకులు చెప్తున్నారని కమల్ హాసన్ వెల్లడించారు.
 
సోషల్‌ మీడియాలో చెన్నై పోలీసులు హింసకు పాల్పడినట్లు వస్తున్న వీడియోలను చూసి షాక్‌కు గురయ్యానని సినీ నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. చెన్నైలో జరిగిన ఆందోళనల్లో పోలీసే ఆటోకు నిప్పంటిస్తున్నట్లు కనిపించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన అనంతరం కమల్‌హాసన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల పట్ల పోలీసుల ప్రవర్తనపై కమల్ హాసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
ద్వంద్వ ప్రమాణాలను తాము ప్రశ్నిస్తున్నామన్నారు. పోలీసుల దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఆటోలకు నిప్పంటించినట్లు వీడియోలో కనిపించిన దృశ్యాలను ప్రస్తావిస్తూ 'వాళ్లు పోలీసులు కాకుండా, నటులు అయి ఉంటారని ఆశిస్తున్నాను' అని కమల్‌హాసన్‌ ఎద్దేవా చేశారు. 
 
ఇక రజనీకాంత్‌తో సినిమా గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ.. నేను‌-రజనీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా రోజులైంది. వారు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌ తాము కలిసి నటిస్తామని చెప్పడం విశేషం. జల్లికట్లుపై తమిళనాడు వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కమల్- రజనీకాంత్ కలిసి నటిస్తే.. మమ్మల్ని భరించేది ఎవరని అడిగారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

బకెట్‌ ని వెపన్ గా పట్టుకొని నాగ చైతన్య తండేల్ ఫైట్

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ మదగజరాజా ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments