Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌ లాక్కుంటారా? చుక్కలు చూపించిన 17 ఏళ్ల బాలిక.. బేటీ బచావొ, బేటీ పడావోకు..?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:41 IST)
Jalandhar girl
లాక్ డౌన్ వేళ నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఫోన్‌ను కొట్టేసి, పారిపోయేందుకు యత్నించిన ఇద్దరు దుండగులకు 17 ఏళ్ల బాలిక చుక్కలు చూపించింది. రాడ్‌తో దాడి చేస్తున్నప్పటికీ... వీరోచితంగా పోరాడి దుండగులకు పోలీసులకు అప్పగించింది. ఆ బాలిక ధైర్యసాహసాలకు గుర్తింపుగా డిసి ఘన్‌శ్యామ్‌ థోరి రూ. 51 వేల నగదు బహుమతిని ప్రకటించారు. 
 
అంతేకాదు... ''బేటీ బచావొ, బేటీ పడావో'' కార్యక్రమానికి ప్రచార కర్తగా నియమించాలని జలంధర్‌ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి సాహస పురస్కారాలకు ఆమె పేరును సిఫారసు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌కు సమీపంలోని కపుర్తలా రోడ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... హోమ్‌ ట్యూషన్‌ నుండి తిరిగి ఇంటికి వెళుతున్న కుసుమకుమారి అనే బాలిక నుంచి ఫోన్‌ను లాక్కునేందుకు బైక్‌పైవచ్చిన ఇద్దరు దుండగులు యత్నించారు. అయితే ఆ బాలిక... దుండగుడిని బైక్‌ ఎక్కకుండా అడ్డుకుంది. దీంతో దుండగుడు ఇనుప రాడ్‌తో బాలిక మణికట్టుపై దాడి చేశాడు. రాడ్‌తో దాడి చేస్తున్నప్పటికీ.. అతనిని బండి ఎక్కకుండా లాగి కింద పడేసింది.
 
అదే క్రమంలో... మరి కొందరు స్థానికుల సాయంతో దుండగుడిని పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాను దుండగులను చూసి భయపడలేదని, మూడు నెలల నుండి తైక్వాండోలో శిక్షణ పొందుతున్నానని ఆ బాలిక తెలిపింది. కాగా... కుసుమ కుమారి తండ్రి కార్మికుడి గాను, తల్లి గృహిణిగాను జీవనం సాగిస్తున్నారు. దుండగుడిని అవినాష్‌ కుమార్ ‌(22) గా గుర్తించారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments