మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

ఠాగూర్
సోమవారం, 24 నవంబరు 2025 (08:46 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ దారుణానికి పాల్పడ్డారు. రీల్స్ కోసం అమ్మాయిలను కిడ్నాప్ చేసింది. ఇందుకోసం ఆ మహిళ సారథ్యంలో ఏకంగా ఓ ముఠానే ఏర్పడటం గమనార్హం. తోటి యువతులను కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంపీలోని జబల్‌పూర్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇటీవల ఓ యువతిని ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అనంతరం ఆమె జుత్తు పట్టుకుని విచక్షణా రహితంగా కొడుతూ కాళ్లతో తన్నుతూ వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన గ్యాంగ్‌లోని ఇద్దరు 17 ఏళ్ల బాలికతో పాటు మరో యువతిని అరెస్టు చేశారు. కేవలం సోషళ్ మీడియాలో పాపులారిటీ కోసమే వీరు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ గతంలోనూ ఇదే తరహాలో మరికొంతమంది యువతులపై దాడులు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments