లైప్ పార్టనర్‌ను చంపి బెడ్ కింద దాచిన కిరాతకుడు - ఎలుక చనిపోయిందని నమ్మించాడు...

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (12:55 IST)
ఎన్సీటీ పరిధిలోని ఫరీదాబాద్‌లో ఓ దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని బెడ్ కింద దాచాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఎలుక చనిపోయిందని ఇంటి యజమానిని నమ్మించాడు. హత్య చేసిన రెండు రోజుల తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తాను చేసిన పని నానమ్మకు చెప్పడం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జితేంద్ర అనే వ్యక్తి 40 యేళ్ల క్రితం సోనియా అనే మహిళతో కలిసి ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, గత వివాహం ద్వారా తనకు కలిగిన కుమార్తె విషయంలో ఇద్దరి మధ్య ఏప్రిల్ 21వ తేదీన గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన జితేంద్రం... ఆ మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ కింద దాచాడు. దుర్వాసన రాకుండా అగరుబత్తులు వెలిగించాడు. 
 
గదిలో ఎలుక చనిపోయిందని అందుకే అరుబత్తీలు వెలిగిస్తున్నానని ఇంటి యజమానిని నమ్మించాడు. అయితే, దుర్వాసన ఎక్కువ కావడంతో జితేంద్ర ఇంటి నుంచి పారిపోయాడు. తనతో ఉంటున్న మహిళను చంపేశానని నానమ్మకు చెప్పగా, ఆవిడ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments