Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోలో 650 కార్యాలయాలపై దాడులు.. అప్పుడు ఇల్లు లేదు.. ఇప్పుడు శ్రీమంతులు!

Webdunia
గురువారం, 7 జులై 2022 (14:49 IST)
Dolo 650
కరోనా వైరస్ మహమ్మారి దేశంలో తాండవం చేస్తున్న సమయంలోనే డోలో 650 మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ కంపెనీ నిర్వాహకులు సంవత్సరంలో సుమారు రూ.450 కోట్లకు పైగా వ్యాపారం చెయ్యడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
 
ఈ నేపథ్యంలో దేశంలో ఔషదాలు (మందులు) తయారు చేస్తున్న 17 కంపెనీల్లో మైక్రో ల్యాబ్స్ సంస్థ భారీ లాభాలు సొంతం చేసుకుని తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఇదే మైక్రో ల్యాబ్ సంస్థ సీఎండీ దిలీప్ సురానా, ఆ కంపెనీ డైరెక్టర్ ఆనంద్ సురానా (సురానా బ్రదర్స్) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపారు. 
 
తాజాగా డోలో 650 మాత్రలు తయారు చేస్తున్న బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మైక్రో ల్యాబ్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగళూరులోని రోస్ కోర్స్ రోడ్డులో ఉంది. 
 
బెంగళూరులోని కార్యాలయంతో పాటు చెన్నై, తమిళనాడు, గోవా, పంజాబ్, సిక్కీం తదితర 40 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేసి పలు పత్రాలు పరిశీలిస్తున్నారు.
 
ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అధినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా ఈ రోజు భారతదేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చోటు సంపాధించుకున్నారు. అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసే దిలీప్ సురానా చెన్నై నుంచి బెంగళూరు చేరుకుని అద్దె ఇంటిలో ఉండేవారు.
 
శ్రీమంతుల జాబితాలో 94వ స్థానం
ఇప్పుడు భారతదేశంలోని 100 మంది కోటీశ్వరుల జాబితాలో సురానా బ్రదర్స్ 94వ స్థానంలో ఉన్నారు. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగరంలోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments