Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పన్నీర్‌సెల్వం అనుమతితో రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ సోదాలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అనుమతితోనే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేయడం గమనార్హం. ఆయన వద్ద అనుమతి తీసుకున్న తర్వాతే రామ్మోహ

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (11:43 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అనుమతితోనే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేయడం గమనార్హం. ఆయన వద్ద అనుమతి తీసుకున్న తర్వాతే రామ్మోహన్ రావు నివాసాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేశారు. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ఆర్థికశాఖ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులతో అత్యవసర చర్చలు జరిపారు. కానీ, ప్రతిరోజూ సీఎం వెంట వచ్చే పలువురు మంత్రుల వాహనాలు బుధవారం కనిపించలేదు. 
 
మరోవైపు... ఐటీ అధికారులు సీఎస్‌ కార్యాలయానికి రావడానికి ముందుగానే ముఖ్యమంత్రి సచివాలయం నుంచి వెళ్లిపోవడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం మీడియా సమావేశం ఉంటుందని ‘లీక్‌’ వచ్చినప్పటికీ... అదేదీ జరగలేదు. 
 
కాగా, తమిళనాడు సచివాలయంలో 2వ అంతస్తులో ఉన్న సీఎస్‌ కార్యాలయం వద్దకు ఐటీ అధికారులు భద్రతా బలగాలను వెంటబెట్టుకుని రావడంతో ‘ఏదో జరిగిందంటూ’ కలకలం రేగింది. పలువురు ఐఏఎస్‌ అధికారులు సచివాలయం వదిలి వెళ్లిపోయారు. వరుసగా బుగ్గ కార్లు బయటకు పరుగులు పెడుతుండడంతో ఏం జరుగుతుందో అర్థంగాక ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments