Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ వర్సెస్ శశికళ .. హైకోర్టు నోటీసు : చిన్నమ్మకు పెరుగుతున్న ఎమ్మెల్యేల మద్దతు

అన్నాడీఎంకే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె స్నేహితురాలు శశికళ పేరును ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ ఎంపీ శ

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (10:47 IST)
అన్నాడీఎంకే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె స్నేహితురాలు శశికళ పేరును ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ ఎంపీ శశికళ పుష్పా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... శశికళతో పాటు.. అన్నాడీఎంకేకు నోటీసు జారీ చేసింది. 
 
ఇదిలావుండగా, జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే‌లో ప్రారంభమైన ‘రాజకీయాలు’ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆధిపత్య పోరు కోసం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె వ్యతిరేక వర్గం మధ్య మొదలైన అంతర్గత పోరులో చివరికి ‘చిన్నమ్మే’ పైచేయి సాధిస్తోంది. పార్టీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవడంలో శశికళ విజయం సాధించారు. 
 
ఆమెకు జై కొడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 130 మంది ఎమ్మెల్యేలు జయ నివాసమైన పోయెస్ గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలంటూ ఆమెను అభ్యర్థించారు. మరోపక్క శశికళ వారసత్వానికి సంబంధించి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సి.పొన్నయ్యన్ ప్రకటించడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments