Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో ఖాతాలో మరో సక్సెస్ : జీశాట్ 7 ప్రయోగం విజయం

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (17:15 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం నమోదైంది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని మోసుకుంటూ జీఎస్ఎల్వీ ఎఫ్-11 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు. 
 
బుధవారం సాయత్రం సరిగ్గా 4 గంటల 10 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్2 ఎఫ్ 11 రాకెట్ ద్వారా 2,250 కేజీల బరువైన ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీశాట్ 7ఏ వైమానిక రంగానికి 8యేళ్ల పాటు సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహ శ్రేణిలో జీశాట్ 7ఏ మూడోది. కేవలం నెలరోజు వ్యవధిలోనే ఇస్రో మూడు ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేయడం గమనార్హం. 
 
ఈ ప్రయోగం వల్ల ఇంటర్నెట్‌, అడవులు, సముద్రాలు, వ్యవసాయరంగ సమాచారాన్ని సేకరించనున్నారు. జీశాట్7ఏ ఉపగ్రహంతో దేశంలో మరింత వేగవంతమైన, విస్తృతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి మరింత సులభతరంకానుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments