ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. 'చంద్రయాన్-2'ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష వాహకనౌక అనుసంధాన ప్రక్రియలో భాగంగా శాస్త్రవేత్తలు వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నారు.
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. 'చంద్రయాన్-2'ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష వాహకనౌక అనుసంధాన ప్రక్రియలో భాగంగా శాస్త్రవేత్తలు వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ - ఎంకే 2 ఉపగ్రహవాహక నౌక ద్వారా ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్దేశిత లక్ష్యాలను సాధించేవిధంగా దేశీయంగా తయారు చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి 'చంద్రయాన్-2' ఉపగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. తొమ్మిదేళ్ల కిందట ప్రయోగించిన 'చంద్రయాన్-1'కు, 'చంద్రయాన్-2' అనేది ఆధునిక మెరుగైన రూపంగా సైంటిస్టులు తెలుపుతున్నారు.
ఈ వ్యోమనౌక ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ అనే మూడు విభాగాల కలయిక ఉంటుంది. 'చంద్రయాన్-2'లో ల్యాండర్ సున్నితంగా ల్యాండింగ్ అవుతుంది. 'చంద్రయాన్-2' కోసం ఆర్బిటార్ సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ వెల్లడించారు.