Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడా! నేను చేసిన తప్పేంటి?.. డేరా బాబా :: ఉరితీయమని గగ్గోలు...

తనకు బతకాలనే ఆశ ఏమాత్రం లేదనీ, అందువల్ల తనను ఉరితీయాలంటూ డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైలు గదిలో బిగ్గరగా అరుస్తూ గగ్గోలు పెడుతున్నాడట. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (14:46 IST)
తనకు బతకాలనే ఆశ ఏమాత్రం లేదనీ, అందువల్ల తనను ఉరితీయాలంటూ డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైలు గదిలో బిగ్గరగా అరుస్తూ గగ్గోలు పెడుతున్నాడట. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబాకు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయనను రోహ్‌తక్‌లోని సునారియా జైలులో బంధించాడు. ఇదే జైలులో శిక్ష అనుభవిస్తూ వచ్చిన ఓ ఖైదీ బెయిల్‌పై విడుదలయ్యాడు. 
 
అతను జైలు బయట మీడియాతో మాట్లాడుతూ... జైలుకి వచ్చిన రోజు రాత్రంతా నిద్ర‌పోకుండా తాను చేసిన త‌ప్పేంట‌ని, ఈ శిక్ష ఎందుకు విధించారు దేవుడా? అని గుర్మీత్ సింగ్‌ బాధ‌ప‌డిపోయాడ‌ని చెప్పాడు. అంతేగాక‌, త‌న‌ను ఉరితీయాల‌ని, త‌న‌కు బ‌త‌కాల‌ని లేద‌ని గుర్మీత్ బాబా వేడుకున్నాడ‌ని తెలిపాడు.
 
అలాగే, గుర్మీత్ బాబాని జైల్లో మిగతా ఖైదీల్లాగే చూస్తున్నార‌ని, ఆయ‌న‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఏమీ లేద‌ని ఆ ఖైదీ చెప్పాడు. కాగా, ఇద్ద‌రు సాద్వీల‌పై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ బాబాకు హ‌ర్యానాలోని పంచ‌కుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, 15 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments