Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్‌కు చేదు అనుభవం: సిరా దాడి... ఇంకు పోసిన వాళ్లను దేవుడు ఆశీర్వదించాలంటూ కామెంట్స్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి ఇంకు దాడి జరిగింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనూర్‌లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్థానిక న

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (12:11 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి ఇంకు దాడి జరిగింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనూర్‌లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్థానిక నేత కుటుంబాన్నిపరామర్శించేందుకు కేజ్రీవాల్ ఇటీవల రాజస్థాన్‌కు వెళ్లారు. ఆసమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... రాజస్థాన్ పర్యటనలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌‌పై బికనీర్‌‌లో ఏబీవీపీకి చెందిన దీనేష్ ఓఝా అనే యువకుడు ఇంకుతో దాడి చేశాడు.
 
ఆప్‌కు చెందిన స్థానిక నేత శంకర్ సేవాదాస్ కుటుంబాన్నిపరామర్శించేందుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సందర్భంగా రాత్రి 10 గంటల సమయంలో అతని నివాసం నుంచి బయటకు వస్తుండగా దినేష్ ఓఝా, కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అని ఆరోపిస్తూ, ఆయన ముఖంపై ఇంకుతో దాడి చేశాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ట్వీట్ చేసిన కేజ్రీవాల్ 'నా మీద ఇంకు పోసిన వాళ్లను దేవుడు ఆశీర్వదించా'లని కోరారు.
 
వారి క్షేమాన్నే నేను కొరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. సర్జికల్ దాడుల వీడియో బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు భావిస్తుండగా, బీజేపీ ఇలాంటి కుటిల యత్నాలు మానుకోవాలని ఆప్ నేతలు సూచిస్తున్నారు. విద్యార్థి విభాగం ఏబీవీపీకి చెందిన దినేష్ ఓజాగా గుర్తించారు. కాగా ఈ ఏడాది జనవరి నెలలో ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి చీలిపోయిన ఓ వర్గానికి చెందిన మహిళ ఢిల్లీలోని ఛత్రసాపాల్ మైదానంలో కేజ్రీవాల్‌పై ఇంక్‌తో దాడిచేసిన విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments