Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతిని నేను హత్య చేయలేదు: నోరు విప్పిన రామ్ కుమార్.. ఇంతకీ ఎవరు చంపారు?

చెన్నై నుంగంబాక్కంలో హత్యకు గురైన స్వాతి హత్య కేసులో హంతకుడు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. స్వాతిని హతమార్చింది రామ్ కుమార్ కాదని.. స్వాతి బాబాయ్ హంతకుడికి ఆశ్రయం కల్పించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తా

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (16:02 IST)
చెన్నై నుంగంబాక్కంలో హత్యకు గురైన స్వాతి హత్య కేసులో హంతకుడు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. స్వాతిని హతమార్చింది రామ్ కుమార్ కాదని.. స్వాతి బాబాయ్ హంతకుడికి ఆశ్రయం కల్పించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా స్వాతి హత్య కేసులో అరెస్టయిన రామ్ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా స్వాతిని తాను హతమార్చలేదని చెప్పడం ప్రస్తుతం సంచలనమైంది. 
 
జూన్ 24వ తేదీ నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. కస్టడీకి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను స్వాతిని హతమార్చలేదని కోర్టులో రామ్ కుమార్ వెల్లడించాడు. స్వాతి కేసులో పోలీసులే అనవసరంగా తనను ఇరికించారని చెప్పాడు. 
 
దీంతో రామ్ కుమార్‌ను 26వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి గోపినాథ్ ఆదేశారు జారీ చేశారు. ఇంతవరకు స్వాతి హత్యకేసులో రామ్ కుమారే హంతకుడని పోలీసులు చెప్తూ వచ్చిన నేపథ్యంలో.. రామ్ కుమార్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments