Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (19:05 IST)
దేశంలో వేసవి కాలం ముగిసినప్పటికీ పగటి పూట ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగింది. గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండిగో విమానం 6ఈ 2521 ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 2.30కు టేకాఫ్‌ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడమే అందుకు కారణంగా తెలుస్తుంది. దీంతో ప్లైట్‌ టేకాఫ్‌కు 2 గంటలు ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. డోర్‌ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. ఏసీ పనిచేయకపోవడంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ ఘటనపై స్పందించిన ఇండిగో వివరణ ఇచ్చింది. 'బాగ్‌డోగ్రా వెళ్లే విమానంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. గమ్యస్థానానికి చేరుకునేందుకు చర్యలు జరుగుతున్నాయి' అని ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments