Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులు అమెరికన్ ఉద్యోగాలను కొల్లగొట్టడం లేదు. సృష్టిస్తున్నారు: ఐటీ మంత్రి

అమెరికాలో భారతీయులు ఉద్యోగాలు కొల్లగొట్టడం లేదని, ఉన్నత అమెరికా, ఉన్నత భారత్ కోసం వారు ఉద్యోగాలు సృష్టిస్తున్నారని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్‌‌క్లేవ్‌లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అమెరికా పాలనాయంత్రా

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (06:30 IST)
అమెరికాలో భారతీయులు ఉద్యోగాలు కొల్లగొట్టడం లేదని, ఉన్నత అమెరికా, ఉన్నత భారత్ కోసం వారు ఉద్యోగాలు సృష్టిస్తున్నారని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్‌‌క్లేవ్‌లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అమెరికా పాలనాయంత్రాంగం ఈ సత్యాన్ని గ్రహిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. 
 
ప్రస్తుతం అమెరికాతో సహా 80 దేశాల్లో 200 నగరాల్లో భారతీయ ఐటీ కంపెనీలు ఉన్నాయని, ప్రత్యేకించి గత అయిదేళ్లలో అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు దాదాపు 20 బిలియన్ డాలర్ల పన్నును ప్రభుత్వానికి చెల్లించారని మంత్రి గుర్తు చేశారు. భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో 4 లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చాయని, ఫార్చ్యూన్ 500లో 75 శాతం కంపెనీలకు మన ఐటీ కంపెనీలు విలువ ఆధారిత సేవలను అందించాయని, అమెరికాకు భారతీయ ఐటీ కంపెనీలు సంపదే తప్ప మరొకటి కాదని మంత్రి చెప్పారు.
 
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ సాంకేతిక నిపుణులు ప్రపంచ స్థాయిలో పోటీపడటంలో దోహదపడతున్నాయని చెప్పారు. హెచ్1-బి వీసాలకు సంబంధించి భారత ప్రభుత్వ ఆందోళనను ఇప్పటికే అమెరికాకు తెలియపర్చామని భారతీయులు ఉద్యోగాలు సృష్టించేవారే తప్ప ఉద్యోగాలు కొల్లగొట్టేవారు కాదని రవిశంకర ప్రసాద్ వక్కాణించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments