Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ షాక్‌కు గురైన బాలిక.. ఆస్పత్రికి తరలించకుండా బురదలో పూడ్చిపెట్టి..?

కరెంట్ షాక్‌కు గురైన బాలికను ఆసుపత్రికి తరలించకుండా బురదలో పూడ్చి పెట్టిన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మనుషులలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:51 IST)
కరెంట్ షాక్‌కు గురైన బాలికను ఆసుపత్రికి తరలించకుండా బురదలో పూడ్చి పెట్టిన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మనుషులలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. పూర్తి వివరాలను పరిశీలిస్తే... 12 ఏళ్ల ముస్కన్ అనే అమ్మాయి మిద్దెపై ఆడుకుంటున్నప్పుడు హైటెన్షన్ వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురై స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆ అమ్మాయి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించకుండా ఓ బురద మడుగులో పూడ్చిపెట్టారు. 
 
ఊపిరిపీల్చేందుకు మాత్రం ఆమె ముక్కు మాత్రమే పైకి ఉంచి మిగతా శరీరమంతా బురదలోనే కప్పేశారు. అలా చేస్తే కరెంటు షాక్ వల్ల ఆమె శరీరంలోకి చేరిన చెడు శక్తులను భూమి పీల్చేసుకుంటుందని వారి నమ్మకమట. దీంతో ఆ బాలికను బురదలోనే ఉంచేశారు. బాలిక పరిస్థితి విషమించడంతో గ్రామస్థులు ఆమెను వెంటనే దగ్గర్లోని ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె కుడి కాలు, కుడి చేయి 90 శాతం కాలిపోయాయని వైద్యులు అన్నారు. ఈ సంఘటన తెలుసుకున్న ప్రతినిధులు వెంటనే ఇళ్లపై ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించాలని ఆదేశించారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments