Webdunia - Bharat's app for daily news and videos

Install App

విస్కీపానంలో మనమే నంబర్ వన్.. కానీ 90 శాతం కల్తీ.. వామ్మో వాన్నో..!

ప్రపంచంలో అత్యధిక శాతం విస్కీని వినియేగించే దేశం భారతదేశమే. కానీ.. మన విస్కీలో 90 శాతం పైగా అసలు విస్కీ కాదు. అది మొలాసిస్తో చేసిన సారాయి. మన దేశంలో తయారు చేసే మూడు రకాల విస్కీల్లో.. మాల్ట్ విస్కీ, గ్రెయిన్ విస్కీలు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గ

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (03:11 IST)
ప్రపంచంలో అత్యధిక శాతం విస్కీని వినియేగించే దేశం భారతదేశమే. కానీ.. మన విస్కీలో 90 శాతం పైగా అసలు విస్కీ కాదు. అది మొలాసిస్తో చేసిన సారాయి. మన దేశంలో తయారు చేసే మూడు రకాల విస్కీల్లో.. మాల్ట్ విస్కీ, గ్రెయిన్ విస్కీలు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉంటాయి. సాధారణ విస్కీ మాత్రం.. మొలాసిస్నుంచి తయారు చేస్తారు. ఇదే దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాన్య మద్యప్రియులు సేవించే విస్కీ. చెరకు గడల నుంచి పంచదారను తయారు చేసేటపుడు ఉప ఉత్పత్తిగా వచ్చే ఒక ద్రవపదార్థం మొలాసిస్.
 
దీనిని డిస్టిల్ చేసి విస్కీని తయారు చేస్తారు. కాకపోతే విస్కీ రంగూ, రుచీ, వాసన కోసం కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. బ్రాందీ, రమ్ము, ఓడ్కా అన్నీ కూడా ఇలా మొలాసిస్‌తో చేసేవే. ఇది 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలోనే ఆరంభమైంది. కారణం.. ఆ కాలంలో కరవు కాటకాలతో ఆహార ధాన్యాలకు ఎల్లప్పుడూ కొరత ఉండటం. ఫలితంగా మద్యం తయారీకి మొలాసిస్‌నే ప్రధాన ఆధారంగా ఎంచుకున్నారు. దేశీయంగా అభివృద్ది చెందిన ఈ షార్ట్ కట్ పద్ధతులనే అధికారిక మద్యం తయారీ విధానంగా మార్చేశారు. అందుకే.. 1500కు పైగా గల భారతీయ మద్యం బ్రాండ్లలో చాలా వాటిని యూరోపియన్ మార్కెట్లలోకి అనుమతించలేదు.
 
విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్నుల పేర్ల ప్రకారం ఆయా రుచులు, రంగులు వచ్చేట్లు కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. తయారైన వెంటనే సీసాల్లో నింపి మార్కెట్‌కు తరలిస్తారు. నిజానికి మన దేశంలో చేసినట్లు విదేశాల్లో మద్యం తయారు చేసి విక్రయిస్తే.. అది పెద్ద స్కామ్ అవుతుంది. కానీ మన దేశంలో ఈ తయారీ విధానాలకు బ్యూరో ఆఫ్ఇండియన్‌ స్టాండర్డ్స్(బీఐఎస్) చట్టబద్ధత కల్పిస్తోంది. ఐఎంఎఫ్ఎల్‌ పేరుతో  అమ్ముడవుతున్న ఈ మద్యం మార్కెట్‌ విలువ ఇంటర్నేషనల్‌ వైన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రకారం 2014లో రూ. 41,000 కోట్లు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments