Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మెడలు వంచుదాం... ఎయిర్ లింక్ కటీఫ్ దిశగా భారత్ అడుగులు...

ముష్కర మూకలతో భారత్‌లో ఉగ్రదాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ మెడలు వంచాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. ఇందులోభాగంగా పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసి మెడలు వంచేలా ఒక్కో చర్య చేపట్టింది.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (10:18 IST)
ముష్కర మూకలతో భారత్‌లో ఉగ్రదాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ మెడలు వంచాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. ఇందులోభాగంగా పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసి మెడలు వంచేలా ఒక్కో చర్య చేపట్టింది. సింధు నది జలాల ఒప్పందం, ఆ దేశానికి మనమిచ్చిన అత్యంత సానుకూల దేశం (ఎంఎఫ్‌ఎన్‌) హోదాలపై సమీక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు గగనతల సంబంధాలనూ తెంచుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. 
 
ఉభయ దేశాల మధ్య విమానాల రాకపోకలను నిషేధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రధాని మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి భారత విమానాలేవీ పాక్‌కు వెళ్లడం లేదు. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) వారానికి ఐదు విమానాలు నడుపుతోంది. ఢిల్లీ-లాహోర్‌ మధ్య రెండు, ముంబై-కరాచీ నడుమ రెండు, ఢిల్లీ-కరాచీ మధ్య ఒక విమానం నడుస్తున్నాయి. 
 
ఉభయ దేశాలకు చెందిన చాలా విమానాలు పరస్పర గగనతలాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. గల్ఫ్‌, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు భారత విమానాలు పాక్‌ గగనతలం మీదుగానే వెళ్తున్నాయి. అలాగే ఆగ్నేయాసియా, బంగ్లాదేశ్‌లకు పాక్‌ విమానాలు భారత గగనతలంమీదుగా వెళ్తున్నాయి. ఉభయ దేశాల నడుమ పౌరవిమానయాన సంబంధాల వివరాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కోరిందని ఆ శాఖ వర్గాలు గురువారం తెలిపాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం