Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500, రూ.1000 నోట్ల రద్దు.. నెట్టింట్లో సెటైర్లు.. జగన్ షాకై వుంటారన్న సోమిరెడ్డి..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో రూ.500 నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు స్నాక్స్ పొట్లాలు మడిచేందుకే పరిమితమంటూ నెట్లో హల్ చల్ చేశాయ

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (09:44 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో రూ.500 నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు స్నాక్స్ పొట్లాలు మడిచేందుకే పరిమితమంటూ నెట్లో హల్ చల్ చేశాయ్. ఈ ఫోటోలను షేర్‌‌ల మీద షేర్ చేసుకుంటున్నారు. ఇక కామెంట్లు అయితే ఓ రేంజ్‌‌లో వస్తున్నాయి.. ఎవరికి నచ్చిన రీతిలో వారు కామెంట్లు చేస్తున్నారు. 
 
నిజానికి 500, 1000 నోట్లను రద్దు చేయాలన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి అర్థరాత్రి దాటిపోయే వరకు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూనే ఉన్నారు. ఇంకొందరైతే మేం రూ. 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు.. పాత న్యూస్ పేపర్‌‌లాగా పాతనోట్లను కేజీ 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామంటూ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేయగలరు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా రూ. 500, 1000 రూపాయల నోట్లకు RIP చెప్పేశారు.
 
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో తాను షాకయ్యానంటూ ఎమ్మెల్సీ సోమిరెడ్డి అన్నారు. వెంటనే తన బీరువా తీసి చూసుకున్నాను.   26 వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని ఎలా మార్చాలా అని ఆందోళన చెందానని.. తానే ఈ రకంగా ఆందోళన చెందితే సోదరుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతగా ఆందోళన చెందారో? అంటూ ఎద్దేవా చేశారు. బెంగళూరు వైట్‌ హౌస్‌లో భూగర్బంలో ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియక షాకై ఉంటారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments