Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు మోడీ విరుగుడు... 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (08:49 IST)
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అదనపు టారిఫ్‌లతో మన జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఇతర ఆభరణాలు వంటి ఎగుమతులను పెంచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. 
 
ఇందుకోసం 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్‍లు నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాల వెల్లడించాయి. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సదరు వర్గాలు తెలిపాయి. ఈ దేశాల్లో మన ఉత్పత్తులకు మార్కెట్‌ను మరింతగా విస్తరించేలా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 
 
ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు 
 
అత్తగారింట్లో భారీ చోరీకి పాల్పడి ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు... చివరకు అతని చేతిలోనే హతమైంది. ప్రియురాలి నోటిలో బాంబు పెట్టి ప్రియుడు పేల్చడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన దర్శిత (20) భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెకు బంధువైన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల దర్శిత, తన అత్త కేసీ సుమత ఇంట్లో 30 సవర్ల బంగారం, రూ.4 లక్షల నగదు దొంగిలించి సిద్ధరాజుతో కలిసి కర్ణాటకకు పారిపోయింది. దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న కేరళ పోలీసులు దర్శితను విచారించగా, తాను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పింది.
 
కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ తాలూకా పరిధిలోని భేర్య గ్రామంలో ఉన్న ఓ లాడ్జిలో దర్శిత, సిద్ధరాజు గది అద్దెకు తీసుకున్నారు. అక్కడ దొంగిలించిన సొమ్మును పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సిద్ధరాజు, గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాన్ని దర్శిత నోటిలో ఉంచి ట్రిగ్గర్ పేల్చాడు. ఈ దాడిలో ఆమె ముఖం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
మొబైల్ ఫోన్ పేలడం వల్లే ఆమె చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన సిద్ధరాజు, అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, కేరళ దొంగతనం కేసుకు, ఈ హత్యకు సంబంధం ఉందని గుర్తించి రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments