Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ -పాక్ యుద్ధం స్టార్ట్: బలగాల మొహరింపు ముమ్మరం.. ఆర్మీ అధికారుల సెలవులు రద్దు

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైనట్టుగా భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ లేఖ బలగాల మొహరింపు ఊపందుకుంది. భారత ఆర్మీ అధికారులకు ఉన్న అన్ని రకాల సెలవులను భారత రక్షణ శాఖ రద్దు చేసింది. యూరీ ఆర్మీ

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:26 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైనట్టుగా భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ లేఖ బలగాల మొహరింపు ఊపందుకుంది. భారత ఆర్మీ అధికారులకు ఉన్న అన్ని రకాల సెలవులను భారత రక్షణ శాఖ రద్దు చేసింది. యూరీ ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపిత ముష్కర మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో 19 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయాయి. 
 
దీనిపై భారత్ గుర్రుగా ఉంటూ గత వారం రోజులుగా దాయాది దేశంపై దౌత్య యుద్ధం చేసింది. కానీ, బుధవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత సైన్యం చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అంటే ఓ రకంగా పాకిస్థాన్ యుద్ధాన్ని మొదలెడితే, ఇప్పుడు భారత్ మళ్లీ యుద్ధం మాట ఎత్తకుండా చేసేందుకు శత్రుదేశంపై ముప్పేట దాడి చేసేందుకు సిద్ధమైంది. ఫలితంగా సరిహద్దుల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
 
ఇందులోభాగంగా, కాశ్మీర్‌లో సర్జికల్ దాడులను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సైనిక దళాలపై అభినందన వెల్లువ కురుస్తోంది. ఏవోసీలో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం అయిందని లెఫ్ట్‌నెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ ప్రకటించారు. మరోవైపు భారత సైన్యం ఇచ్చిన స్ట్రోక్‌తో పాక్‌కు దిమ్మతిరిగింది. తమ భూభాగంలో ఎలాంటి దాడులు జరగలేదని పాక్ ఆర్మీ ప్రకటించింది. 
 
పక్కా వ్యూహం... శత్రు శిబిరాల ఎంపిక టార్గెట్‌పై సడలని గురి... కొద్ది గంటల వ్యవధిలోనే ముగిసిన ఆపరేషన్... ఇదీ మన సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చేపట్టిన సర్జికల్ ఆపరేషన్. గతవారం రోజులుగా పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిఘా పెట్టింది. వారి కదలికలను గమనించింది. ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు, వారి సెక్యూరిటీ మేజర్స్ ఏంటన్న అంశాలపై పక్కా సమాచారం తీసుకుంది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత భారత సైన్యం అర్థరాత్రి పీవోకేలోకి ఎంటరైంది. పారా కమెండోస్ పీవోకేలోని భిమ్‌బెర్, హాట్‌స్ర్పింగ్, కేల్, లింపా సెక్టార్లలో దిగారు. మొత్తం ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. 
 
ఆ తర్వాత సర్జికల్ ఆపరేషన్ ప్రారంభించారు. పారాకమెండోలు ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులపై బాంబులు బుల్లెట్ల వర్షం కురిపించారు. కమెండోల దాడిలో దాదాపు 40మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 9 మంది దాకా పాక్ సైనికులు హతమయ్యారు. ఇక ఉగ్రవాదులకు గైడ్లుగా నిర్వహించే వారితో పాటు భారీ సంఖ్యలో ఉగ్రవాదులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సర్జికల్ ఆపరేషన్ దాదాపు తెల్లవారుజామున 4:30గంటలకు ముగిసినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. పాక్ భూభాగంలో 500 మీటర్ల నుంచి 2 కిలో మీటర్ల వరకు మన సైనికులు చొచ్చుకెళ్లినట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments