Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిలో అగ్రస్థానంలో భారత్ ... పాకిస్థాన్‌ను మించిపోయింది..

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (06:46 IST)
అంతర్జాతీయంగా భారత్ అప్రతిష్టపాలైంది. మరో చెడ్డ పేరును ఆపాదించుకుంది. అవినీతిలో అగ్రస్థానం సంపాదించుకుంది. విచిత్రమేమిటంటే.. దాయాది దేశం పాకిస్థాన్ కంటే భారత్ అవినీతిలో తారస్థాయిలో ఉండటం గమనార్హం. ఆసియా ఖండంలోనే అత్యంత అవినీతి దేశాల్లో తొలి స్థానంలో భారత్ నిలిచింది. 
 
ఈ విషయాన్ని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెల్లడించింది. జర్మనీకి చెందిన ఈ సంస్థ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సంస్థ నివేదికను ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 69 శాతం అవినీతితో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 
 
కానీ, దాయాది దేశం పాకిస్థాన్ మనకంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌లో 40 శాతం అవినీతి నమోదైంది. ఈ జాబితాలో 65 శాతం మంది లంచాలు తీసుకునేవారితో వియత్నాం రెండో స్థానంలో నిలిచింది. థాయిలాండ్‌లో 41 శాతం అవినీతి ఉన్నట్టు తేలింది. జపాన్ కేవలం 0.2 శాతం అవినీతితో చివరి స్థానంలో ఉంది.
 
ఇకపోతే, భారత్‌లో ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో లంచాలు ఇచ్చేవారేనని ఈ సర్వేలో తేలింది. ప్రాథమిక సౌకర్యాల కల్పనకు కూడా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి భారత్‌లో నెలకొందని పేర్కొంది. పబ్లిక్ స్కూల్స్, ఆసుపత్రుల్లో కూడా లంచాల బెడద తప్పడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments