Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ముమ్మాటికీ హిందూ రాజ్యమే : మోహన్ భగవత్

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (09:58 IST)
ఇంగ్లండ్ దేశంలో ఉన్నవాళ్లను ఇంగ్లీష్ వాళ్లని... అమెరికాలో ఉండేవారిని అమెరికన్స్ అని... జర్మనీలో ఉండేవారిని జర్మన్స్ అని పిలుస్తున్నప్పుడు... హిందుస్థాన్‌లో ఉంటున్నవారిని హిందువులు అని పిలిస్తే తప్పేంటని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. అందువల్ల భారత్‌ ముమ్మాటికీ హిందూ రాజ్యమేనంటూ ఆయన మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
వీహెచ్‌పీ సంస్థ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో జరిగిన ఓ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం హిందూ రాజ్యమని... హిందుత్వమనేది దాని గుర్తింపని... హిందుత్వం దేశంలోని అన్ని మతాలను తనలో ఇముడ్చుకుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఈయన గతంలో కటక్‌లో జరిగిన ఓ సభలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలే చేసిన విషయం తెల్సిందే. ఇండియా అంటే హిందుస్థాన్ అని, హిందూస్థాన్‌లో ఉండే పౌరులంతా హిందువులు గానే పిలువబడతారని ఆన్నారు. ప్రపంచం అంతా భారతీయులను హిందువులుగానే గుర్తిస్తోందని, అందువల్ల ఇండియా హిందూ దేశమేనని వ్యాఖ్యానించారు. భారతీయులందరి సాంస్కృతిక గుర్తింపు హిందూత్వమే అన్నారు. దేశ వాసులంతా ఈ మహోన్నత సంస్కృతికి వారసులని భగవత్ చెప్పుకొచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments