Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కుబేరులు పెరిగిపోయారోచ్.. ఆసియా రీజియన్‌లో భారత్‌కు నాలుగో స్థానం-జపాన్ టాప్

భారత్‌లో కుబేరుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు భారత్ ఆసియా పసిఫిక్ రీజియన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే నిదర్శనం. ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో అత్యధిక కుబేరులు ఉన్న దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచి

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (16:28 IST)
భారత్‌లో కుబేరుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు భారత్ ఆసియా పసిఫిక్ రీజియన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే నిదర్శనం. ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో అత్యధిక కుబేరులు ఉన్న దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా దేశం ఉన్నది. ఇక నాలుగో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. 
 
దీని ప్రకారం 2014లో భారత్‌లో 1.8 లక్షల మంది కుబేరులు వుండగా, ఈ సంఖ్య 2015లో రెండు లక్షలకు పెరిగింది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో కుబేరుల స్థానంలో జపాన్ అగ్రస్థానంలో ఉండగా, ఆ దేశంలో కుబేరుల సంఖ్య 27 లక్షలకు పైగా ఉందని క్యాప్ జెమీనీ సర్వే తేల్చింది. 
 
జపాన్‌లోకుబేరుల సంపాదన 11.4 శాతం పెరిగి 6,57,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. తరువాత స్థానంలో ఉన్న చైనాలో 10 లక్షలకు పైగా కుబేరులు ఉన్నారు. చైనాలో కుబేరుల సంపద 16.9 శాతం పెరిగి 5,26,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న కుబేరుల సంపాదన 1.6 శాతం పెరిగి 79,700 కోట్ల డాలర్లకు చేరుకుందని క్యాప్ జెమినీ నివేదిక పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం
Show comments