పాక్ ఎఫ్-16 విమానాన్ని నడిపిన పైలట్ మాకు తెలుసు!

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (13:47 IST)
సరిగ్గా రెండు వారాల క్రితం పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసిన తర్వాత పాకిస్థాన్ ఎదురు దాడికి దిగిన సంగతి విదితమే. పాక్ తన వద్దనున్న ఎఫ్-16 ఫైటర్ జెట్లతో ఇండియాలోని మిలిటరీ స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ కుట్రను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. మిగ్-21 బైసన్ జెట్‌ను నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్ పాక్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే ఆ ఎఫ్-16 విమానాన్ని నడుపుతున్న పైలట్ వివరాలు తనకు తెలుసు అని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రకటించారు. 
 
ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడారు. మన రక్షణ బలగాలకు ఆ పాకిస్థానీ పైలట్ వివరాలు తెలుసు అని అంగీకరించడానికి ఆమె మొదటగా నిరాకరించారు. అయితే ఆ తర్వాత మరోసారి అడగడంతో అవును, మాకు తెలుసు అని అన్నారు. అయితే ఆ వివరాలను మాత్రం బయటకు చెప్పలేదు. పాక్‌కు చెందిన ఎఫ్-16 కూలింది అనడానికి ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎలక్ట్రానిక్ ఆధారం కూడా తమ దగ్గర ఉన్నదని భారత విదేశాంగ శాఖ ఇదివరకే వెల్లడించింది. అసలు పాక్ ఈ దాడికి ఎఫ్-16 వాడింది అవడానికి ఆ విమానం నుండి ఫైర్ అయిన అమ్రామ్ మిస్సైల్ శకలాలనే భారత్ ఆధారంగా చూపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments