Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధ్.. భారత్‌లో భాగం కావాల్సిందే: స్పష్టం చేసిన అద్వానీ

ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమై ఉన్న సింధ్ ప్రాంతం భారత్‌లో భాగం కానంతవరకు భారదదేశం అసంపూర్ణ దేశంగా కనిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని ఒక రాష్ట్ర రాజధానిగా

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (03:36 IST)
ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమై ఉన్న సింధ్ ప్రాంతం భారత్‌లో భాగం కానంతవరకు భారదదేశం అసంపూర్ణ దేశంగా కనిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని ఒక రాష్ట్ర రాజధానిగా ఉంటున్న కరాచీ నగరం భారత్‌లో భాగం కాకుండా ఉన్నందుకు చాలా బాధగా ఉందని అద్వానీ చెప్పారు. కరాచీలో దాదాపు 9 దశాబ్దాల క్రితం ఒక సింధీ కుటుంబంలో జన్మించిన అద్వానీ తన మూలాలు పరాయి దేశంలో ఉంటున్నందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
కరాచీ కానీ, సింధ్ కాని భారత్‌లో భాగం కావు అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంటుంది. సింధ్ ప్రాంతంలో ఉన్నప్పుడు నా బాల్యంలో ఆర్ఎస్ఎస్‌లో చురుగ్గా పనిచేసేవాడిని. తల్చుకుంటేనే నాకు విచారం, ఉద్వేగం కలుగుతుంటాయి. ఒకటి మాత్రం చెప్పగలను. సింధ్ లేని భారత్ అంసపూర్ణ దేశమేనన్నది నా ప్రగాఢ విశ్వాసం అన్నారు అద్వానీ.
 
అద్వానీ తన బాల్యం, సింధ్‌లో తన గత జీవిత జ్ఞాపకాలు తల్చుకుని భావోద్వేగంతో సింధ్ భారత్‌లో భాగమై ఉండాలని ప్రకటించి ఉండవచ్చు కానీ, అద్వానీ ప్రకటనపై పాకిస్తాన్ స్పందన ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవాల్సిందే. వృద్ధాప్యంలో అద్వానీ వ్యాఖ్యలను కాస్త తేలిగ్గా తీసుకుంటేనే మంచిదేమో మరి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments