Webdunia - Bharat's app for daily news and videos

Install App

2047 వికసిత్‌ థీమ్‌.. 11వ సారి ఎర్రకోటపై మోదీ.. అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా!

సెల్వి
గురువారం, 15 ఆగస్టు 2024 (08:04 IST)
PM Modi
2047 వికసిత్‌ థీమ్‌తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరగుతున్నాయి. 78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై వ‌రుస‌గా 11వ సారి త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అలాగే జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా భార‌త సైన్యం హెలికాప్ట‌ర్ల‌తో పూలవ‌ర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర‌మంత్రుల‌తో పాటు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌ర‌య్య‌ారు. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందించ‌నున్నాయి. 
 
ఈ సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. 
 
ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.
 
"దేశం కోసం ధైర్యంగా, కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న మన సైనికులు, మన రైతులు, మన యువత అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని విపత్తుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖం, కష్ట కాలంలో దేశం అడుగడుగునా వారికి అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు నేను భరోసా ఇస్తున్నాను" అని మోదీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments