మన్మోహన్ సింగ్ రికార్డును సమం చేసిన ప్రధాని.. మధ్యతరగతి సొంతింటికల?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (17:16 IST)
Modi
వరుసగా పదోసారి ఎర్రకోట నుంచి జెండా ఎగురువేయడం ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమం చేశారు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగానూ మరో ఘనత సాధించారు. 
 
గాంధీ చూపిన అహింసా మార్గంతో స్వాతంత్య్రం సాధించామని ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
దేశంలో ప్రస్తుతం 10 వేల జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటిని 25 వేలకు పెంచనున్నామని తెలిపారు. కొన్నాళ్ల కిందట మణిపూర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అక్కడ 100 శాతం శాంతి నెలకుంటుందని మోదీ చెప్పారు.
 
ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదు. మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. 
 
పట్టణాల్లోని దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. రూ.లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తామని ప్రధాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments