Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుకు అడ్డంగా దిగాలనీ సెల్ఫీకి ప్రయత్నించి జైలుపాలైన కుర్రోళ్లు

Webdunia
శనివారం, 28 మే 2016 (12:10 IST)
రోజురోజుకి సెల్ఫీ పిచ్చోళ్ల చేష్టలు మితిమీరుతున్నాయి. చిన్నపెద్ద లేకుండా ప్రతియొక్కరి చేతుల్లోను స్మార్ట్ ఫోన్‌లు ఉండటం, అలా ఫోటో దిగి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ సెల్ఫీలు సరదాకి తీసుకుంటే ఫర్వాలేదుగానీ కొంతమంది ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. డ్రైవింగ్‌లో, రోడ్లల్లో ఇలా రకరకాల చోట్ల సాహసాలు చేస్తున్నారు. కానీ కొందరు ఆకతాయిలు రైలు దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు. దీనిలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా ఇలాంటి సెల్ఫీలకు పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో కొంతమంది యువకులు పాట్నా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రె‌స్ ఎదుట సెల్ఫీ దిగాలనే పిచ్చి కోరికతో తుండ్లా - ఎట్మద్పూర్ వద్ద పెద్దపెద్ద రాళ్లు, చెట్టుకొమ్మలు వేసి ట్రాక్ని బ్లాక్ చేశారు. అదృష్టవశాత్తు డ్రైవర్ ఈ విషయాన్ని గమనించి ఎమెర్జెన్సీ బ్రేక్ వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. 
 
ఈ ఘటనకు పాల్పడినవారు 13-16 ఏళ్ల లోపు పిల్లలే. స్పీడుగా వస్తున్న రైలులో ఎన్నోసార్లు సెల్ఫీలు దిగారు కూడా. ఆర్పీఎఫ్ సిబ్బంది ఈ టీనేజర్లను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెల్ఫీ పిచ్చి ఆ టీనేజర్లను ఊసలు లెక్కపెట్టించింది. బహుశా ఈ విషయం తెలుసుకున్న ఎవరూ ఇకమీదట సెల్ఫీల జోలికి వెళ్లరేమో.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments