Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధారణ ఖైదీల తరహాలోనే జయలలితకు కూడా ఆహారం!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:02 IST)
బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న సాధారణ ఖైదీల తరహాలోనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆహారం అందిస్తున్నామని, అమెకు ప్రత్యేకంగా బయట నుంచి ఆహారాన్ని తెప్పించడం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. 
 
జైలు అధికారులు పెట్టే భోజనాన్ని తిరస్కరిస్తున్న జయలలిత, బయటి నుంచి భోజనాన్ని తెప్పించండంటూ జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదట. జైల్లోని మిగతా ఖైదీల మాదిరే జయలలిత కూడా తాము అందించే ఆహారాన్నే భుజిస్తున్నారని సాక్షాత్తు జైలు అధికారులే వెల్లడిస్తున్నారు. ఒకటి లేదా రెండు చపాతీలు, బ్రెడ్, పాలు, బిస్కెట్లను జయలలిత తీసుకుంటున్నారని ఓ జైలు అధికారి వెల్లడించారు. 
 
అంతేకాక జయలలిత జైలులో ఆరోగ్యంగానే ఉన్నారని కూడా ఆయన తెలిపారు. తామిచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న జయలలిత, బయటి నుంచి ఆహారం తీసుకురమ్మని తమకు ఆదేశాలు జారీ చేయడం లేదని కూడా సదరు అధికారి తెలిపారు. జయలలిత జైలు జీవితం గురించి బయట జరుగుతున్న ప్రచారం మొత్తం కల్పితమని ఆ అధికారి చెప్పుకొచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments