Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్ల కష్టాలు... రూ.500తో వివాహం చేసుకున్న ఐఏఎస్‌ల జంట

దేశంలో కరెన్సీ కష్టాలతో అనేక పెళ్లిళ్లు రద్దు అవుతున్నాయి. మరికొన్ని పెళ్లిళ్లు తమ వద్ద ఉన్న చిన్నపాటి మొత్తంతోనే పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. వీరి వివాహం కేవలం

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (13:05 IST)
దేశంలో కరెన్సీ కష్టాలతో అనేక పెళ్లిళ్లు రద్దు అవుతున్నాయి. మరికొన్ని పెళ్లిళ్లు తమ వద్ద ఉన్న చిన్నపాటి మొత్తంతోనే పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. వీరి వివాహం కేవలం 500 రూపాయలతో పూర్తి చేసి ఔరా అనిపించుకోవడమే కాకుండా, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్‌ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట ప్రస్తుతం గోహాడ్‌‌లో ఎస్‌డీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకున్న సలోని సిదానా విజయవాడలో ఎస్డీఎంగా పనిచేస్తున్నారు. 2013లో ఐఏఎస్ పరీక్షను పాసైన వీరిద్దరు ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమించుకున్నారు. దీంతో ఇటీవల తమ వివాహానికి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బింద్‌ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.
 
దీంతో కోర్టు వారికి నవంబర్‌ 28వ తేదీని కేటాయించింది. ఈ నేపథ్యంలో కోర్టు వద్దకు వచ్చిన ఇరు కుటుంబాల సభ్యులు చట్టపరంగా చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కేవలం రూ.500తో వివాహం చేసుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఆ ఐదువందలు కూడా కోర్టు ఫీజుగా చెల్లించడం గమనార్హం. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments