Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్‌‌కు ఘన స్వాగతం.. యావత్ భారతం ఎదురుచూపు

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (13:06 IST)
మరికొద్ది గంటల్లో భారత్‌కు రానున్న వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాగతం పలకడానికి యావత్ భారతం ఎదురు చూస్తోంది. అందరికంటే ముందు భారత సైన్యం ఇప్పటికే వాఘా సరిహద్దు వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం విడుదల చేస్తారని తెలియడంతో చాలామంది ఔత్సాహికులు గురువారం నుంచే వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు. 
 
దీనితో వాఘా సరిహద్దు వద్ద పండుగ వాతావరణం చోటు చేసుకుంది. భారీ ఎత్తున జనం అక్కడికి చేరుతుండటంతో అక్కడ ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఆర్మీతో పాటు పంజాబ్ పోలీసులు కూడా వాఘా సరిహద్దులో భారీ సంఖ్యలో మొహరించారు. భారత ప్రజల నినాదాలతో వాఘా సరిహద్దు దద్దరిల్లుతోంది.
 
అయితే సరిహద్దు సైన్యంతో పాటు వాయుసేన అధికారులు కూడా అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానమంత్రిని అభ్యర్థించడం విశేషం. కాగా జెనీవా ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ అభినందన్‌ను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయి. ఆ సంస్థ వారు అభినందన్‌ను వాఘా సరిహద్దుకు తీసుకువస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments