Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు.. ఉద్యోగులకు మెయిల్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (11:28 IST)
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని పేర్కొంటూ ఇటీవల బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీన్ని భారత్‌లో ప్రసారంకాకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం నుంచి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైలలో ఉన్న కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన ఉద్యోగులకు బీబీసీ ఈమెయిల్స్ పంపించింది. ఐటీ అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. జీతం గురించి అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని, వ్యక్తిగత ఆదాయం గురించి స్పందించకుండా ఉండొచ్చని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. 
 
బ్రాడ్‌కాస్ట్ విభాగం వారు కార్యాలయాలకు రావాలని, మిగిలిన సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలని చెప్పింది. అలాగే ఈ సర్వే గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించ వద్దని ఇదివరకే సిబ్బందికి సంస్థ స్పష్టంచేసింది. 
 
కాగా, గుజరాత్‌ అల్లర్లలో నరేంద్ర మోడీ హస్తం ఉందని "ఇండియా: ద మోడీ క్వశ్చన్‌" పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోడీకి క్లీన్‌చిట్‌ లభించాక ఇలా అభాండాలు వేయడమేమిటని భాజపా అభ్యంతరం తెలిపింది. 
 
దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంగళవారం రంగంలోకి దిగింది. 2012 నుంచి ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశీలనను సోదాలు కాదు.. సర్వే అని ఐటీ విభాగం పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments